Fateh trailer: మహేష్ చేతుల మీదుగా "ఫతే" ట్రైలర్..! 1 d ago
బాలీవుడ్ స్టార్ హీరో సోను సూద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన "ఫతే" మూవీ ట్రైలర్ రిలీజ్ అయ్యింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ట్రైలర్ ను విడుదల చేశారు. "ఈ మూవీ అద్భుతంగా ఉంటుందనుకుంటున్న.. నా ప్రియ మిత్రుడు సోను సూద్ కి శుభాకాంక్షలు. ఈ చిత్రాన్ని థియేటర్ లో చూసేందుకు వేచిచూస్తున్న" అని ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై సోను సూద్ స్పందిస్తూ " థాంక్స్ బ్రదర్.. మనమిద్దరం కలిసి ఓ మూవీ చేద్దాం" అని రీ ట్వీట్ చేశారు.